: ఉస్మానియా నుంచి నిమ్స్ కు జగన్ తరలింపు
వైకాపా అధినేత జగన్ ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి నుంచి నిమ్స్ కు భారీ బందోబస్తు మధ్య తరలించారు. దీంతో నిమ్స్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. జగన్ ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో జగన్ ను చూడడానికి పోలీసులు అనుమతి ఇవ్వక పోవటంతో విజయమ్మ, భారతి నిమ్స్ వద్దకు బయలుదేరి వెళ్లారు. ఎమర్జెన్సీ బ్లాక్ లోని ట్రామా కేర్ సెంటర్ లో రూమ్ నెంబర్ 132 ను జగన్ కు వైద్యం కోసం కేటాయించారు. నిమ్స్ నుంచి కూడా విజయమ్మ ,భారతిలను సిబ్బంది బయటకు పంపారు.