: సభకు అనుమతివ్వండి: డీజీపీని కోరిన ఏపీఎన్జీవోలు
సెప్టెంబర్ 7న హైదరాబాదులో తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు అనుమతివ్వాలని ఏపీఎన్జీవోలు డీజీపీ దినేశ్ రెడ్డిని కోరారు. హైదరాబాదులో ఆయనను కలిసిన ఏపీఎన్జీవో నేతలు ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఏపీఎన్జీవోలు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.