: ఉలిక్కిపడిన కోల్ కతా
కోల్ కతా ప్రజలు ఉలిక్కిపడ్డారు! దేశంలో పలు చోట్ల బాంబు పేలుళ్ళకు పాల్పడ్డ యాసిన్ భత్కల్ అరెస్టయి రెండ్రోజులు కూడా గడవకముందే మరో బాంబు పేలుడు జరిగింది. కోల్ కతాలోని చాందినీ చౌక్ వద్ద ఓ బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. మరో రెండు బాంబులను పేలకముందే కనుగొన్నారు. వాటిని బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది తీవ్రవాద సంస్థల పనా? లేక, మరెవ్వరైనా బాంబులు పెట్టారా? అన్నది తేలాల్సి ఉంది.