: కిరణ్, బాబు, జగన్, విజయమ్మలపై హరీశ్ రావు సూటి విమర్శలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కిరణ్, చంద్రబాబు, జగన్, విజయమ్మలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం వారు స్పందిస్తున్న తీరును హరీశ్ రావు తప్పుబట్టారు. సీఎం కిరణ్ ఓ ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం ప్రధానికి ఆగమేఘాలపై లేఖ రాసిన బాబు.. తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. సీమాంధ్ర టీడీపీ నేతల దీక్షల వెనుక బాబు కుట్ర దాగి ఉందని విమర్శించారు. ఆత్మగౌరవ యాత్ర టీడీపీ నేతల దీక్షలకు దన్నుగానే సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇక, పదవి, అధికారం కోసం దేన్నయినా వదులుకునే వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్, విజయమ్మ దీక్షలు ఎందుకు చేపట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు.