: లోక్ సభ సెప్టెంబర్ 2 వరకు వాయిదా


సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిన లోక్ సభ సెప్టెంబర్ 2 వరకు వాయిదా పడింది. కాగా, ఈ ఉదయం నుంచి సభ నాలుగుసార్లు వాయిదాపడింది. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ సీమాంధ్ర టీడీపీ సభ్యులు సభలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అటు సభ్యుల నిరంతర ఆందోళనకు విసుగుచెందిన కేంద్రం మరోసారి సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయనుందని సమాచారం. ఇందుకోసం చర్చించినట్లు కూడా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News