: దీక్ష విరమించండి: జగన్ కు పార్టీ సూచన
దీక్ష విరమించాలంటూ అధినేత జగన్ కు వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. ఆరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో దీక్షకు స్వస్తి పలకాలని పార్టీ సూచించింది. ఈ మధ్యాహ్నం హైదరాబాదులోని లోటస్ పాండ్ వద్ద పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం జగన్ దీక్ష విరమించాలని సలహా ఇచ్చారు. తాను జగన్ ను దీక్ష విరమించాలని ఎన్నిసార్లు చెప్పినా, తనను వారించాడని తెలిపారు.జగన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. జగన్ ను చూడాలని ఉన్నా, ఆసుపత్రిలోకి తమను అనుమతించడంలేదని పేర్కొన్నారు.