: ప్రధాని ప్రకటనపై విపక్షాల ఆందోళన
రూపాయి పతనంపై ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటనపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆ ప్రకటనపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. మరోవైపు, సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సీమాంధ్రకు న్యాయం చేయాలని, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో, లోక్ సభను మధ్యాహ్నం 12.45 గంటలవరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.