: భత్కల్ ను నేడు ఢిల్లీకి తరలించనున్న పోలీసులు


ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్ ను నేడు ప్రత్యేక విమానంలో బీహార్ పోలీసులు ఢిల్లీకి తరలించనున్నారు. అతనితో పాటు మరో తీవ్రవాది తబ్రేజ్ అలియాస్ అసదుల్లాను కూడా తీసుకువెళ్లనున్నారు. వీరిని పాటియాల కోర్టులో ప్రవేశపెడతారు. అరెస్టు అనంతరం నిన్న పోలీసులు మోతీహరిలోని కోర్టు ఎదుట హాజరుపరచగా, వీరికి కోర్టు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండు విధించింది. ఈ మేరకు నేడు భత్కల్ ను ఎన్ఐఏ కు అప్పగిస్తారు.

  • Loading...

More Telugu News