: టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో టీటీడీ పరిధిలోని ఉద్యోగులందరూ సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అర్చకులు, ఆలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇలా తమకు తాము సామూహిక సెలవు ప్రకటించుకుని ఇటువంటి నిరసన తెలియజేయడం తొలిసారి అని చెప్పాలి. అటు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అత్యంత తక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఈ ఉదయం భక్తులు లేక తిరుమల వీధులు బోసిపోయినట్టు కనిపించాయి.