: ఒప్పందం రద్దుపై కేంద్రానికి అగస్టా కంపెనీ లేఖ
అగస్టా హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం తగదంటూ ఇటలీకి చెందిన ఫిన్ మెకానికా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ఒప్పందంలో 350 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు రావడంతో కేంద్రప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సదరు సంస్థకు తెలిపింది. అయితే నిరాధార ఆరోపణలతో ఒప్పందాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తూ ఫిన్ మెకానికా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రేమండ్ ఎడ్వర్డ్స్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.