: దీని వయసు 820 కోట్ల సంవత్సరాలు!


అంతరిక్షంలో మనందరికీ ప్రాణాధారమైన సూర్యుడి వయసు 460 కోట్ల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు లెక్కించారు. విశ్వంలో ఇంతకన్నా ఎక్కువ వయసున్న నక్షత్రాన్ని ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు గుర్తించలేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో సూర్యుడికన్నా చాలా ఎక్కువ వయసున్న నక్షత్రాన్ని గుర్తించారు. దీని వయసు ఏకంగా సూర్యుడికన్నా కూడా 360 కోట్ల సంవత్సరాలు పెద్దదిగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

బ్రెజిల్‌కు చెందిన పరిశోధకులు ఒక పెద్ద నక్షత్రాన్ని, ఒక చిన్న నక్షత్రాన్ని గుర్తించారు. వీటిలో పెద్ద నక్షత్రానికి 'హెచ్‌ఐపీ 102152' అని పేరు పెట్టారు. చిన్న నక్షత్రానికి '18 స్కార్పీ' అని పేరు పెట్టారు. ఇందులో పెద్ద నక్షత్రం వయసు మన సూర్యుడి వయసులో 360 కోట్ల ఏళ్లు పెద్దదిగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో మన సూర్యుడిలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాన్ని అంచనా వేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నక్షత్రం 250 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని వయసు 820 కోట్ల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఖగోళ శాస్త్రవేత్తలు భవిష్యత్తులో సూర్యుడిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? అనే విషయాన్ని తెలుసుకోవడానికి సూర్యుడికన్నా కూడా పెద్ద వయసున్న నక్షత్రాల కోసం కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ కొన్ని నక్షత్రాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇప్పుడు కనుగొన్న హెచ్‌ఐపీ 102152 నక్షత్రం అత్యంత స్పష్టంగా కనిపిస్తూ, సూర్యుడికన్నా కూడా చాలా పెద్దదిగా ఉంది. దీనిపై లోతుగా అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో సూర్యుడిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News