: కిరణ్ పదునైన వ్యాఖ్యలు.. ఎవరిపై?


సీఎం కిరణ్ రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాదులో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పదునైన వ్యాఖ్యలు చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోని ప్రభుత్వాలకు ప్రజలు చాలాసార్లు సెలవు ఇచ్చారని పేర్కొన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సమయం సందర్భం వచ్చినప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యలు కేంద్రాన్ని ఉద్దేశించి చేసినవే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News