: సినీ ఫక్కీలో మూడు లగ్జరీ కార్లు ఐదు నిమిషాల్లో దొంగతనం
సినీ ఫక్కీలో ఐదే ఐదు నిమిషాల్లో నలుగురు మనుషులు మూడు లగ్జరీ ఎస్ యూవీలను దొంగిలించుకుపోయిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అంధేరీలోని ఓ కార్ల కంపెనీలో రాజ్ కుమార్ అనే యువకుడు తెల్లవారుజామున ఐదు గంటలకు కార్లు శుభ్రం చేసుకుంటున్నాడు. ఇంతలో నలుగురు వ్యక్తులు వచ్చి తమ కారును శుభ్రం చేయమని కోరారు. అంతలోనే అతని దగ్గర తాళాలు లాక్కుని ముగ్గురు వ్యక్తులు మూడు ఎస్ యూవీలను స్టార్ట్ చేశారు. ఏం జరుగుతోందో అర్థంకాక బిత్తరపోయి నిల్చున్న రాజ్ కుమార్ ను మరో వ్యక్తి తన హోండా కారులోకి ఎక్కమన్నాడు. హైవే పైకి వెళ్లాక రాజ్ కుమార్ ను కార్లోంచి తోసేసి దొంగిలించిన కార్లతో పరారయ్యారు. ఇదంతా కేవలం ఐదే నిమిషాల్లో జరిగిందని రాజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.