: దలైలామా మహాకుంభమేళా పర్యటన రద్దు
అలహాబాద్ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు రావల్సిన టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పర్యటన రద్దయ్యింది. ఇవాళ్టి నుంచి దలైలామా కుంభమేళాలో పర్యటించాల్సి ఉంది. భద్రతా కారణాల రీత్యా దలైలామా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వహిందూపరిషత్ వర్గాలు తెలిపాయి. అయితే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దలైలామా భద్రతపై ఎలాంటి సమాచారం అందించకపోవడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.