: బాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ టిను వర్మ అరెస్ట్


బాలీవుడ్ పాప్యులర్ స్టంట్ డైరెక్టర్ టిను వర్మను హత్యాయత్నం నేరం కింద ముంబయి స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల కిందట తన సోదరుడు, స్టంట్ డైరెక్టర్ అయిన మనోహర్ వర్మను టిను కత్తితో తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. దాంతో, ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరిన మనోహర్ కు రెండు కాళ్లలో రాడ్లు వేసి ఆరు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. కోలుకోవడానికి ఐదు నెలలు పడుతుందని వైద్యులు తెలిపారు. సోదరులు ఇద్దరికి ఆస్తుల విషయంలో వచ్చిన ఘర్షణ కారణంగానే సహనం కోల్పోయిన టిను.. మనోహర్ ను దారుణంగా గాయపర్చాడు. తాజాగా మనోహర్ జాన్ అబ్రహాం నటించి, నిర్మించిన'మద్రాస్ కేఫ్' సినిమాకు పని చేశాడు.

  • Loading...

More Telugu News