: ఉద్యమ తీవ్రతను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళింది నేనే: చిరంజీవి


సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు వివరించింది తానేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చెప్పుకొచ్చారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని అధిష్ఠానం చెప్పిందని, అందుకే తాను హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశానని తెలిపారు. ఆ నిర్ణయం తప్పంటే పదవికి రాజీనామా చేస్తానని చిరంజీవి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర కోసం ఇతర ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలకు సిద్ధపడితే తానూ పదవిని త్యజించేందుకు వెనకాడబోనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News