: బాంబు నిర్వీర్యం చేస్తున్న సమయంలో పోలీసు మృతి


బాంబు నిర్వీర్యం చేసి ప్రజలను కాపాడదామనుకున్న ఆ పోలీసును మృత్యువు కబళించింది. నిర్వీర్యం చేస్తున్న సమయంలో బాంబు పేలడంతో బాంబు స్క్వాడ్ లో ఉన్న ఓ పోలీసు మృత్యువాత పడ్డాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ పేలుడులో 'కమత్ పుర్ లిబరేషన్ ఆర్గనైజేషన్'(కేఎల్ఓ)కు సంబంధం ఉందని అనుమానిస్తున్నట్లు అలీపూర్ సబ్ డివిజినల్ పోలీసు ఆఫీసర్ తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు.

  • Loading...

More Telugu News