: రాడియా కేసుపై సుప్రీంలో రహస్య విచారణ
దేశంలో సంచలనం సృష్టించిన నీరా రాడియా సంభాషణల కేసులో సుప్రీం కోర్టు రహస్య విచారణను ప్రారంభించింది. జస్టిస్ జీఎన్ సింఘ్వీ, వి.గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 27న ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ న్యాయవాది, సీబీఐ, ఇన్ కమ్ టాక్స్ అధికారులు మినహా మరెవరూ ఈ విచారణకు హాజరయ్యే అవకాశం లేదు. నీరా రాడియా అనే కార్పొరేట్ లాబీయిస్టు తొమ్మిదేళ్ల సమయంలో కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన వైనం 2007లో వెలుగులోకి వచ్చింది. బెంగాల్ లో టాటాల కార్ల కర్మాగారం నెలకొల్పేందుకు జరిగిన లాబీయింగ్ లో పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.