: ఉప్పల్ టెస్టుకు గట్టి భద్రత


జంట పేలుళ్ల నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాదులో జరిగే రెండవ టెస్టు మ్యాచుకు అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీక్షకులకు రక్షణ కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. భద్రత సమీక్షలో భాగంగా ఆస్ట్రేలియా క్రికెట్ సెక్యూరిటీ అధికారి, బీసీసీఐ ఉన్నతాధికారులు..  సైబరాబాద్ పోలీసు కమిషనరేటులోని అధికారులతో సమావేశమయ్యారు.

భద్రత ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే అంశంపై చర్చించామని హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ వెల్లడించారు. మార్చి 2వ తేదీనుంచి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండవ టెస్టు మొదలవుతుంది.

  • Loading...

More Telugu News