: సోనియా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతల పూజలు
అనారోగ్యంతో బాధపడుతున్న తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కోలుకోవాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూజలు నిర్వహించారు. హైదరాబాదులోని పలు ఆలయాల్లో చేసిన పూజల్లో మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర నేతలు పాల్గొన్నారు.