: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి: శైలజానాథ్
రాష్ట్రాన్ని ఎప్పట్లానే సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా కోరుతున్నారని మంత్రి శైలజానాథ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అధిష్ఠానం నిర్ణయం మార్చుకునేలా మరింత ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ఒక్క పార్టీ కూడా చెప్పలేదని, కనీసం ఇప్పటికైనా తమ వాదనలు మార్చుకోలేదని ఆయన ఆక్షేపించారు. పార్టీలు ఓట్ల రాజకీయాలు మానుకుని చిత్తశుద్ధితో ఆలోచించి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయని శైలజానాథ్ స్పష్టం చేశారు.