: శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పది కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ


సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలు జిల్లాలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తారస్థాయికి చేరుతున్నాయి. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీశైలం నుంచి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వద్ద సమైక్యవాదులు ధర్నా నిర్వహించారు. దీంతో తెలంగాణ నుంచే వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్య, ఉద్యోగ, కార్మిక, రవాణా శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో పది కిలోమీటర్ల మేర 500 వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేసీఆర్, సోనియాగాంధీల దిష్టి బొమ్మలను దహనం చేశారు.

  • Loading...

More Telugu News