: పదివేల మందితో 'సమైక్య' స్వరార్చన


ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. జిల్లావ్యాప్తంగా సమైక్యరాగం వినిపిస్తూ ప్రజలు ర్యాలీలు, ధర్నాలు, దీక్షలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 10 వేల మంది విద్యార్థులు సమైక్యాంధ్ర స్వరార్చన కార్యక్రమం చేపట్టారు. సమైక్యతను చెడగొడితే తెలుగు జాతికే చేటు అంటూ 10 వేల మంది విద్యార్థులు పలు కీర్తనలు ఆలపించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 2 వేల మంది భవన నిర్మాణ కార్మికులు భారీ ర్యాలీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే హైదరాబాద్ కు అత్యధికంగా కార్మికులు వలస వెళ్లారని, రాష్ట్ర రాజధానిలో ప్రతి పది ఇళ్లలో ఒక శ్రీకాకుళం వాసి ఉంటాడని, అన్ని ప్రాంతాల వారు రాజధాని మీదే ఆధారపడుతున్నారని అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎలా విడదీస్తారని ప్రశ్నిస్తూ సమైక్య నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News