: పీఎస్ఎల్వీ-సి20 ప్రయోగ వేళలో మార్పు
పీఎస్ఎల్వీ-సి20 రాకెట్ ప్రయోగ వేళలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందు నిర్దేశించినట్టుగా 5.56 గంటలకు బదులు 6.01 నిమిషానికి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు షార్ అధికారులు తాజా ప్రకటన చేశారు.
కాగా, కౌంట్ డౌన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రస్తుతం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సీఎం కిరణ్, గవర్నర్ నరసింహన్ అక్కడే ఉన్నారు. వీరికి షార్ డైరక్టర్ ఎంవైఎన్ ప్రసాద్ రాకెట్ ప్రయోగం గురించి వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్న శాస్త్రవేత్తలు రాకెట్ వివిధ బాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.