: నిజాయతీ కలెక్టర్ ను సమర్థించినందుకు బహుమతి ఇదీ...
ఉత్తరప్రదేశ్ లో రాజకీయనాయకుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. వారి అదుపాజ్ఞల్లో ఉండని ఐఏఎస్ అధికారులపై అక్కడి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి, ఆనక ఓ భూ వివాదంలో సస్పెండైన దుర్గాశక్తి నాగ పాల్ ను సమర్ధించిన గౌతమ బుద్ధనగర్ జిల్లా కలెక్టర్ ను బదిలీ చేసింది అక్కడి ప్రభుత్వం. అప్పటి ఘటనలో కలెక్టర్ తప్పేమీ లేదని జిల్లా కలెక్టర్ రవికాంత్ సింగ్ నివేదిక ఇచ్చారు. దీంతో ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన బదిలీకి కారణమేమీ వెల్లడించలేదు. ఆయనను వెయిటింగ్ లో ఉంచి మరో అధికారిని ఆయన స్థానంలో నియమించారు.