: దిగ్విజయ్ కి సమైక్య సెగ


తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై సీమాంధ్ర ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం, విద్యుత్ సౌధలో జరుగుతున్న ఉద్యమాలపై వివరణ అడిగిన దిగ్విజయ్ సింగ్ కు సీమాంధ్ర ఉద్యోగులు తాము విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్ తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని సమాధానమివ్వడంపై సీమాంధ్ర ఉద్యోగులు మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఎవరి హక్కని విభజించారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక ఏంటని అడిగారు. రాజకీయ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేస్తారని అన్నారు.

విభజన జరిగిపోయిందని, ఇంకేదైనా అడగండనడంతో.. సీమాంధ్రుల హక్కులు కాపాడండని సీమాంధ్ర ఉద్యోగులు తెలిపారు. దీనికి నిరసనగా దిగ్విజయ్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. సరిగ్గా అదే సమయంలో దిగ్విజయ్ ను కలిసేందుకు వచ్చిన మంత్రులు ఆనం, రఘువీరా, ఎంపీ అనంతలను చుట్టుముట్టారు. విభజన జరుగుతుంటే చూస్తూ ఊరుకుని, ఇప్పుడు నాటకాలు ఎందుకు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్టీ అధిష్ఠానం విభజన జరగాల్సిందే అంటూంటే మీరేం చేస్తున్నారని, ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News