: ఆర్ధికవేత్త హయాంలోనే ఆర్ధిక సంక్షోభం: బీజేపీ
ఆర్ధికవేత్త మన్మొహన్ సింగ్ హయాంలోనే దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుమార్ ఆరోపించారు. రూపాయి పతనంపై ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత బిల్లు తెస్తున్నామంటూనే రూపాయి ప్రాణం తీస్తోందని మండిపడ్డారు. ఇక, తెలంగాణ ఉద్యమంపై నిబద్ధతతో పోరాడుతున్న బీజేపీపై టీజేఏసీ నేతల ఆరోపణలు సమంజసం కాదని హితవు పలికారు.