: విశాఖలో భారత్-ఎ, కివీస్-ఎ జట్ల మ్యాచ్ కు వానపోటు


భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ జట్ల మధ్య మూడు రోజుల మ్యాచ్ నేడు విశాఖలో ఆరంభమవ్వాల్సి ఉండగా వరుణుడు అడ్డుపడ్డాడు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వైజాగ్ లో భారీవర్షం పడడంతో ఇక్కడి ఎసీఏ-విడీసీఏ స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో, తొలి రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దయింది. కాగా, భారత జట్టుకు అభిషేక్ నాయర్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, న్యూజిలాండ్ జట్టుకు టామ్ లోధమ్ నాయకత్వం వహించనున్నాడు. కివీస్ జట్టులో భారత సంతతి ఆటగాడు సోధీ అడుతుండడం విశేషం. ప్రతిభావంతులతో నిండి ఉన్న ఇండియా-ఏ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే గెలుపు నల్లేరుమీద నడకే.

  • Loading...

More Telugu News