: ఆపరేషన్ ధుర్యోధన-2.. సీఎం పథకాల ప్రచారం కోసమేనా...?


జగపతి బాబు, పోసాని కృష్ణ మురళి కాంబినేషన్లో వస్తున్న 'ఆపరేషన్ ధుర్యోధన-2' చిత్రం..  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాల నేపథ్యంగా రూపొందినట్టు విశ్వసనీయ సమాచారం. మరికొద్ది నెలల్లో పంచాయితీ ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో ప్రజల్లోకి వెళ్లేందుకు సినిమాను మించిన ప్రచార సాధనం మరొకటి లేదన్న భావనతోనే కాంగ్రెస్ వర్గీయులు ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.

ఇందులో ప్రధానంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేస్తున్న కృషి వంటి పలు అంశాలు ఉంటాయని సన్నిహిత వర్గాలంటున్నాయి. కాగా, ఈ సినిమాను మార్చి 15న థియేటర్లతో పాటు ఎయిర్ టెల్ డీటీహెచ్ లోనూ విడుదల చేయనున్నారు. ఇతర డీటీహెచ్ లలోనూ ఈ సినిమా విడుదుల చేయడానికి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.  

  • Loading...

More Telugu News