: హెచ్ పీసీఎల్ మృతులు 14 మంది
విశాఖ హెచ్ పీసీఎల్ లో కూలింగ్ టవర్ పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఉదయం అప్పారావు అనే కార్మికుడు మృతి చెందగా, శ్రీనివాసరావు, కృష్ణ చందన మధ్యాహ్నం మృతి చెందారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 14 కు చేరింది.