: అద్వానీని కలిసిన ఏపీఎన్జీవోలు


బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీని ఏపీఎన్జీవోలు కలిశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో పలువురు ప్రతిపక్ష నేతలను కలిసి సమైక్యతా రాగం ఆలపిస్తున్న ఏపీఎన్జీవోలు తాజాగా అద్వానీజీని కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్ర విభజన వల్ల తెలుగు జాతి ఎలా నష్టపోతుందో వివరించారు. విభజన అసంబద్దంగా ఉందని, ప్రజాభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆయనకు తెలిపారు. దీనిపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు, నేతలు చేస్తున్న ఆందోళనలు అద్వానీకి వివరించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఎండగట్టారు. ప్రజాభీష్టం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని ఆయనను కోరారు.

  • Loading...

More Telugu News