: హోటల్లో కాల్ గాళ్స్ తో ఎమ్మెల్యే రాసలీలలు
లక్షల మందికి ప్రజాప్రతినిధి అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. తనను గెలిపించిన వారి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పని చేయాలి. కానీ, అరాచకాలు, అన్యాయాలు, అత్యాచారాలు, దోపిడీలకు నిలయమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎస్పీ కి చెందిన ఒక ఎమ్యెల్యే బుద్ధి గడ్డితిన్నది. చేయరాని పనులు చేస్తూ పరాయి రాష్ట్రంలో పోలీసులతో బేడీలు వేయించుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ శాసనసభ్యుడు మహేంద్ర కుమార్ సింగ్ గోవా రాజధాని పనాజీలో వ్యభిచారం కేసులో బుక్కయ్యాడు. ఒక హోటల్లో ఆరుగురు అమ్మాయిలతో కులుకుతూ ఉండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. తీరా అతను ఎమ్మెల్యే అని తేలింది. అరెస్ట్ చేసి, ఉత్తరప్రదేశ్ స్పీకర్ కు సమాచారం అందించారు. ఎమ్మెల్యేకి అమ్మాయిలను సరఫరా చేసిన వారు పరారీలో ఉన్నారు.