: గీతారెడ్డి గారూ.. అసలేం జరిగింది: సీబీఐ
మంత్రి గీతారెడ్డిని జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని ఆమె నివాసానికి నిన్న రాత్రి 10 గంటల సమయంలో వెళ్లి, లేపాక్షి నాలెడ్జి హబ్, ఇందూ ప్రాజెక్టులకు భూ కేటాయింపులలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించారు. కేటాయింపులలో అసలేం జరిగిందంటూ వివరాలు రాబట్టారు. ఇదే కేసులో మరికొందరినీ విచారించనున్నట్లు సమాచారం.