: షార్ లో రెడ్ అలెర్ట్.. సముద్రతీరం వెంబడి బలగాల మోహరింపు


శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. పాకిస్తాన్ తీవ్రవాదుల నుంచి షార్ కు ముప్పు పొంచి ఉందని, దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో శ్రీహరికోట వద్ద సముద్ర తీరం వెంబడి సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. టెర్రరిస్టులు సముద్ర మార్గం గుండా రావచ్చన్న ఐబీ అంచనాలతో ఈ చర్య తీసుకున్నారు. కొందరు పాక్ టెర్రరిస్టులు శ్రీలంక మీదుగా భారత్ లో ప్రవేశించారని ఇంతకు ముందు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News