: భక్తులతో కిటకిటలాడిన హంసల దీవి పుణ్యక్షేత్రం


మాఘ పౌర్ణమి సందర్బంగా కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హంసల దీవి భక్తులతో కిటకిటలాడింది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు ఇక్కడి సముద్ర తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతకుముందు ఆదివారం రాత్రి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

కాగా, కృష్ణా నది సముద్రంలో కలిసే చోట అధికారులు తమను స్నానాలు చేయనివ్వడంలేదని భక్తులు వాపోయారు. ఇక ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖుల్లో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ కూడా ఉన్నారు. 

  • Loading...

More Telugu News