: వైజాగ్ లో ఏఆర్ రెహ్మాన్ కచేరీ
స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ తన మ్యూజిక్ టూర్లో భాగంగా మన రాష్ట్రంలోనూ సందడి చేయనున్నాడు. ఆయన త్వరలోనే వైజాగ్ లో కచేరీ చేయనున్నాడు. 'రెహ్మానిష్క్' పేరిట ఈ సంగీత కెరటం దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ మొదటివారంలో వైజాగ్ లో ఆయన ప్రదర్శనకు రంగం సిద్ధమవుతోంది. కాగా, రెహ్మాన్ టూర్లో తొలి కచేరీకి అక్టోబర్ 1న కోల్ కతా వేదికగా నిలవనుంది.