: ప్రభుత్వ కార్యాలయాల్లోకి బయటి వారొస్తే చూస్తూ ఊరుకోం: అనురాగ్ శర్మ
ఉద్యోగులు ప్రాంతాలవారీగా విడిపోయి ఉద్యమబాట పట్టడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ పలు ఆంక్షలు విధించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళనలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే నిరసనల్లో ఇతరులు పాల్గొనేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భావోద్వేగాలు చెలరేగే అవకాశం ఉండడంతో ఏపీఎన్జీవోలు, తెలంగాణ ఉద్యోగులు వేర్వేరు సమయాల్లో ఆందోళనలు చేసుకోవాలని సూచించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపితే అభ్యంతరం లేదని, నిరసన అదుపుతప్పితే మంచిదికాదని అన్నారు. ఎవరైనా సరే బహిరంగంగా నిర్వహించే కార్యక్రమాలకు పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదని హైదరాబాద్ శాంతిభద్రత పరిరక్షణ తమపై ఉందని అనురాగ్ శర్మ తెలిపారు.