: సర్కారు వైఫల్యం వల్లే పేలుళ్లు: తలసాని
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జంట పేలుళ్లు జరిగాయని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం సమర్థులైన అధికారులను వేరే విభాగాలకు తరలించిన ప్రభుత్వం...అసమర్థులకు కీలక విధులు కట్టబెట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని తలసాని ఆరోపించారు.
ప్రభుత్వంలోని నేతలకు పదవులు, కుర్చీలపై ఉన్న శ్రద్ధ..ప్రజల సంక్షేమంపై లేదని ఆయన విమర్శించారు. బాంబు పేలుళ్లకు వ్యతిరేకంగా సికింద్రాబాదు లో టీడీపీ చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని తలసాని తప్పుపట్టారు.