: అంగారక యాత్రలో ఇస్రో ముందడుగు
అంగారకుడిపైకి యాత్ర తలపెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముందడుగు వేసింది. 'మార్స్ ఆర్బిటర్' ను తీసుకువెళ్లనున్న పీఎస్ఎల్ వీ సీ-25 రాకెట్ కు మొదటి దశలో వినియోగించే ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్‌ను నిన్న ప్రయోగించి చూశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సమక్షంలో విజయవంతంగా ప్రయోగించారు. ఈ పరీక్షలో పీడనం, ఉష్ణోగ్రత, చోదకబలం తదితర అంశాలన్నింటినీ శాస్త్రవేత్తలు పరిశీలించారు. దీంతో అంగారకయాత్రకు సంబంధించి కీలక ముందడుగు పడింది.