: తమ్ముడి హత్య కేసులో ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు రిమాండ్
తమ్ముడి హత్య కేసులో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ కు ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను జిల్లా జైలుకు తరలించారు. జూలై 17న చంద్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో హత్యకు గురయ్యారు. చంద్రశేఖరే తన 0.32 పిస్టల్ తో జగన్మోహన్ ను సమీపం నుంచి కాల్చి చంపారని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.