: క్యాన్సరును కనుగొనేందుకు కొత్త పద్ధతి


క్యాన్సర్‌ మహమ్మారిని అందునా నిశ్శబ్దంగా ఆక్రమించుకునే అండాశయ క్యాన్సరు వ్యాధిని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక సరికొత్త పద్ధతిని తయారు చేశారు. ఈ వ్యాధి మొదలైన తర్వాత చాలా కాలం వరకూ దీన్ని సరిగా గుర్తించలేరు. అలా కాకుండా ఆరంభంలోనే ఈ వ్యాధిని గురించి తెలుసుకుంటే దీన్ని నివారించేందుకు తగు వైద్యాన్ని అనుసరిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అండాశయ క్యాన్సరు వ్యాధిని ఆరంభంలోనే గుర్తించే ఒక సరికొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు తయారు చేశారు.

టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అండాశయ క్యాన్సరు వ్యాధిని గుర్తించేందుకు ఒక సరికొత్త పద్ధతిని రూపొందించారు. ఈ పద్ధతిలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారకముందే నిక్కచ్చిగా నిర్ధారించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఈ వ్యాధిని నిర్ధారించడానికి సరైన స్క్రీనింగ్‌ వ్యూహాలు లేవని, ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటికి కనిపించవనీ, ప్రారంభ దశలో ఈ వ్యాధిని గుర్తించడం కష్టమని పరిశోధకులు చెబుతున్నారు. చాలామంది మహిళల్లో అండాశయ క్యాన్సరు వ్యాధిని గుర్తించే నాటికి బాగా ముదిరిపోయి ఉంటుందని, అందుకే ఇది తీవ్రస్థాయి ప్రాణాంతక వ్యాధిగా పేరుపొందిందని పరిశోధకులు తెలిపారు. క్యాన్సరు కణితి మార్కర్‌గా పేరుపొందిన 'సీఏ125' అనే రక్త ప్రోటీనులో మార్పులను రెండు దశల్లో స్క్రీనింగ్‌ చేసే పద్ధతిని కరెన్‌ లూ నేతృత్వంలోని పరిశోధకులు రూపొందించారు.

వీరు రూపొందించిన ఈ కొత్త పద్ధతిలో సుమారు నాలుగువేలమందికి పైగా రుతుక్రమం ఆగిపోయిన మహిళలను శాస్త్రవేత్తలు 11 ఏళ్లపాటు పరిశీలించారు. ఈ పరిశీలనలో 'అండాశయ క్యాన్సరు ముప్పు క్రమసూత్ర పద్ధతి' పేరిట చేసిన గణాంకాల ప్రకారం వీరిని మూడు బృందాలుగా విడదీసి పరిశీలించారు. వీరిలో సగటున 5.8 శాతంమంది ప్రతిఏటా మధ్యస్థాయి ముప్పు బారిన పడుతున్నట్టు తేల్చారు. దీనివల్ల వీరు ప్రతిమూడు నెలలకు ఒకసారి 'సీఏ125' పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News