: ఈ నెల 28,29న తిరుమల దిగ్బంధం: సీమాంధ్ర జేఏసీ
సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 28, 29 తేదీల్లో తిరుమలను దిగ్బంధించనున్నట్లు సీమాంధ్ర జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలను నిలిపివేయనున్నట్లు చెప్పారు. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఆ తేదీల్లో అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా మూసివేయాలని చెప్పారు.