: 'ఆహార భద్రత బిల్లు'పై ఈ రోజు లోక్ సభలో ఓటింగ్
దేశంలో 67 శాతం మందికి లబ్ది చేకూర్చే 'ఆహార భద్రత బిల్లు'పై ఈ రోజే లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం సభలో బిల్లుపై చర్చ జరుగుతోంది. చర్చ ముగిసిన అనంతరం మంత్రి కేవీ థామస్ సమాధానమిస్తారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది. కాగా, బిల్లులో సవరణలు చేయాలంటూ ఇప్పటివరకు 318 నోటీసులు అందాయి. అటు, సమావేశాలను సెప్టెంబర్ ఆరు వరకు పొడిగించారు.