: కామాంధులకు కఠిన శిక్ష పడేలా చేయడమే సవాలు: కమిషనర్
ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు అందరూ స్థానికులేనని ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. నిందితులందరినీ అదపులోకి తీసుకున్నామని, సాక్ష్యాలు సేకరించడం, చార్జిషీటు నమోదు చేయడమే ఇప్పుడు తమ ముందున్న సవాలని ఆయన పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నిందితులు నిరక్షరాస్యులు, నిరుద్యోగులని, పలు చోరీ కేసులతో ప్రమేయం ఉన్నవారని ఆయన తెలిపారు. నిందితులంతా 18 ఏళ్లు నిండిన వారేనని స్పష్టం చేశారు.