: హామీ మేరకే 'ఆహార భద్రత బిల్లు': సోనియాగాంధీ


2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లోక్ సభలో 'ఆహార భద్రత బిల్లు' ప్రవేశపెట్టామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. తమ హామీని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బిల్లు ద్వారా చారిత్రాత్మక అడుగువేసే అవకాశం దక్కిందన్నారు. బిల్లు ద్వారా ఆహారధాన్యాలు వ్యర్ధం కాకుండా చూడవచ్చని సభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సోనియా అన్నారు. ఏ చిన్నారి కూడా పోషకాహార లోపంతో బాధపడకూడదన్నదే తమ లక్ష్యమన్న సోనియా, బిల్లు ద్వారా రైతులకు లబ్ది కలుగుతుందన్నారు. భవిష్యత్తులో ఆధార్ అనుసంధానంతో రాయితీల దుర్వినియోగాన్ని నివారించవచ్చని చెప్పారు. ఆహార భద్రత బిల్లుతో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సోనియా తెలిపారు.

  • Loading...

More Telugu News