: డార్జిలింగ్ లో స్తంభించిన జనజీవనం
ప్రముఖ పర్యాటక కేంద్రం డార్జిలింగ్ లో జనజీవనం స్తంభించింది. గూర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో ఈ ప్రాంత ప్రజలు చేపట్టిన నిరవధిక ఆందోళన ఆరో రోజుకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటి వరకు 800 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంది. నిరవధిక ఆందోళనలతో మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. దీంతో అక్కడి ప్రభుత్వమే 11 దుకాణాల ద్వారా బియ్యం, గోధుమలను పంపిణీ చేస్తోంది. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో అక్కడి ఉద్యమం పతాకస్థాయికి చేరుకుంది. తమ వేష, భాషలు వేరు కనుక.. తెలంగాణ ప్రకటించిన యూపీఏ, గూర్ఖాల్యాండ్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి ఉద్యమకారులు.