: సుబ్బరామిరెడ్డికి సమైక్య సెగ


రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డికి సమైక్య సెగ తగిలింది. విశాఖలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సమైక్యవాదులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఎంపీలు నాటకాలాడుతున్నారని, తక్షణం రాజీనామాలు ఆమోదింపజేసుకుని ప్రజా ఉద్యమంలోకి రావాలని ఆయనను ఘెరావ్ చేశారు. దీంతో సుబ్బరామిరెడ్డి తాను సమైక్యవాదినని, తమ రాజీనామాలు స్పీకర్ దగ్గరున్నాయని స్పష్టం చేశారు. అనంతరం సమైక్యవాదులతో కలిసి నినాదాలు చేశారు. దీంతో శాంతించిన ఉద్యమకారులు ఆయన వాహనాన్ని కదలనిచ్చారు.

  • Loading...

More Telugu News