: హైదరాబాదులో బాంబు కలకలం


హైదరాబాదు కృష్ణానగర్ లోని శ్రీసాయిరాం పాఠశాలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. పాఠశాల యాజమాన్యం బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించింది. దీంతో, బాంబు స్క్వాడ్ సిబ్బంది హుటాహుటిన పాఠశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఓవైపు వీరు తనిఖీలు నిర్వహిస్తుండగానే, రహమత్ నగర్ పరిసర ప్రాంతాల్లో మరో రెండు చోట్ల బాంబులు పెట్టారనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన బాంబు స్క్వాడ్ బాంబులేవీ లేవని తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మల్కాజిగిరిలోని ప్రశాంతి నగర్ లోని ఫ్రోబెల్స్ గార్డెన్ హైస్కూలుకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే అవన్నీ ఆకతాయిల పని అని పోలీసులు తేల్చేశారు.

  • Loading...

More Telugu News