: అసోంలో అల్లర్లు.. పోలీసుల కాల్పుల్లో 30 మందికి గాయాలు


అసోంలోని కాచర్ జిల్లాలో రాంగ్ పూర్ ప్రాంతం అల్లర్లు, పోలీసుల కాల్పులతో అట్టుడికిపోయింది. గత రాత్రి రాంగ్ పూర్ లోని మూడు ప్రార్థనా మందిరాల వద్ద అభ్యంతరకరమైన వస్తువులు పడి ఉన్నాయంటూ వదంతులు రావడంతో కొంత మంది యువకులు ఆవేశంతో దాడులకు దిగారు. వాహనాలకు నిప్పంటిస్తూ, రాళ్లదాడికి పాల్పడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితం రాలేదు. దీంతో వారు కాల్పులు ప్రారంభించారు. కాగా, రాళ్ళదాడిలో జిల్లా ఎస్పీ దిగంత బోరా, మరో ఏడుగురు పోలీసులు సహా మొత్తం 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చేర్పించారు. ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆర్మీ సహాయం కోరింది.

  • Loading...

More Telugu News