: ఆ కమిటీపై ఇప్పుడే స్పందించను: గాదె


తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం తరపున ఏర్పాటయ్యే కమిటీ విధివిధానాలు రాకముదే స్పందించడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గతంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆయా రాష్ట్రాలు తీర్మానాలు చేసి పంపాయని, వాటి ఆధారంగానే కొత్త రాష్ట్రాలు ఏర్పాడ్డాయన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. అయితే మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని అన్నారాయన.

  • Loading...

More Telugu News